Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ ను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
ఇక హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స చేశారు వైద్యులు. అయితే.. తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం కీలక ప్రకటన వచ్చింది. సూపర్‌స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా వుందట. జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. దీంతో సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు.