Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి సీజన్లో పంట పెట్టుబడికి అందించే రైతు బంధు సాయాన్ని డిసెంబర్ లోనే అన్నదాతలకు ఇస్తారట. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. శనివారం వనపర్తి జిల్లా లో పర్యటించిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కూడా అన్నారు. అదే విధంగా ఏ ఇబ్బంది కూడా రైతులకి కలగకుండా చూస్తానని అన్నారు.