Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది. సోమవారం నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో రాజసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిలిచిపోయింది. తన వాహనం మార్చాలంటూ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఇంటిలిజెన్స్ ఐజీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని రాజసింగ్ ఆవేదన చెందారు. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదని రాజసింగ్ మండిపడ్డారు. కాగా... కొద్దినెలల క్రితం రాజాసింగ్ షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిలిచిపోయింది. దీంతో మరో వాహనం తెప్పించుకుని రాజాసింగ్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజాసింగ్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆ వాహనంలోనే వెళ్లాల్సిందిగా పోలీసులు రాజాసింగ్‌కు తెలిపారు. అయితే తరుచూ వాహనం చెడిపోతుండటంతో ప్రభుత్వంపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.