Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్ డాక్టర్లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా, ఆయన ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉందని చెప్పారు. క్రిటికల్ స్టేజ్‌లో అందరూ డాక్టర్‌లు కలిసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కృష్ణ రాగానే ఎమర్జెన్సీకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం కృష్ణ క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నాడని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఆయన చాలా రోజులుగా మా దగ్గర చికిత్స తీసుకుంటున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో మహేష్ బాబు భార్య నమ్రత, కృష్ణను గచ్చిబౌలీలోని కాంటినెంటల్ హస్సిటల్‌లో చేర్చారు అని కాంటినెంటల్ వైద్యులు మీడియాకు తెలిపారు.