Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన విషయం విదితమే. ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా మునోగుడుకు విచ్చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రజలకు అభివాదం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.