Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు కేరళలో సోదాలు చేస్తున్నారు. రామచంద్ర భారతికి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడి ఆశ్రమానికి సిట్ అధికారులు వెళ్లారు. అయితే అధికారులు వచ్చేలోపే వైద్యుడు పరారైనట్లు సమాచారం. దీంతో వైద్యుడి పర్యవేక్షకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడికోసం గాలిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రదేశాలు కర్నాటక, హర్యానాతోపాటు ఏపీలోని రెండు ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి సిట్ బృందం కేరళ వెళ్లింది. రామచంద్ర భారతికి సన్నిహితుడిగా ఉన్న ఓ వైద్యుడి ప్రమేయం ఈ కేసులో ఉన్నట్లు సిట్ అధికారులు భావించి అతనిని అదుపులోకి తీసుకోడానికి వెళ్లగా ఈ సమాచారం తెలుసుకుని వైద్యుడు పరారయ్యాడు. దీంతో వైద్యుడి పర్యవేక్షకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే తిరుపతిలో కూడా సిట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.