Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనుమకొండ: మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తీరనిలోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండలోని మందాడి నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి మంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మందాడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.