Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తూ.. సుశీ ఇన్ ఫ్రాపై జీఎస్టీ ఆఫీసర్లు సోదాలు చేస్తున్నారు. సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొనసాగుతున్నారు.