Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్ మాట్లాడుతూ, ఓ ప్రైవేటు హాస్టల్ భవనం పై నుంచి కిందకు దూకిన విద్యార్థిని అక్షిత
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ హాస్టల్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రధమ సంవత్సరం చదువుతున్న రామాయంపేటకు చెందిన అక్షిత (17) ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని సోమవారం ఉదయం మృతి చెందింది. మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి మృతదేహానికి నిజామాబాద్ జిల్లా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రామయణంపేటకు చెందిన ప్రదీప్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు.వీరిలో చిన్న కుమార్తె అక్షిత నిజామాబాదులో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇటీవల కుటుంబ కలహాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై, రాత్రి తల్లికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో తల్లికి ఫోన్ మాట్లాడేందుకు పై అంతస్తులోకి వెళ్ళింది. ఎంతకీ తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఫోన్ కిందకు విసిరేసి ఆ భవనం పైనుండే కిందకు దూకి ఆత్మ హత్యాకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ నరహరి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ కూతురు చనిపోయినట్లు తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు హుటాహుటిన నిజామాబాదుకు చేరుకొని కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.