Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు మునుగోడులో ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని కోరుతూ రెండు గంటలకు పైగా ఆయన తన అనుచరులతో కలసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత మధ్యే ఆయనను అక్కడి నుంచి తరలించారు.