Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు గుండె పోటు వచ్చిందని వైద్యులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేయడంతో గుండె పోటు ముప్పు నుంచి కృష్ణ తప్పించుకున్నా సాయంత్రానికి కూడా తీవ్ర విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కృష్ణకు చికిత్సలు అందిస్తున్న కాంటినెంటల్ ఆసుపత్రి ఓ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం కృష్ణకు 8 మంది వైద్య నిపుణులతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కార్డియాక్ అరెస్టులో కృష్ణ శరీరంలోని పలు అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని ఆసుపత్రి తెలిపింది. కార్డియక్ అరెస్టు కారణంగా కృష్ణ శరీరంలోని మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెడదు పనితీరు దెబ్బ తిన్నదని వెల్లడించింది. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమని కూడా వెల్లడించింది. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.