Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిల్లి: దీదీ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న తృణమూల్ నేత అఖిల్ గిరి ఆదివారం బీజేపీ నేతలు ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూపాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ కారణంగా ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపడి ముర్ముకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోమవారం మమతా బెనర్జీ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని దీదీ అన్నారు. అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరఫున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్లు దీదీ ప్రకటించారు.ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తన కేబినెట్ మంత్రిని హెచ్చరించారు. సోమవారం మరో ప్రకటన చేసిన అఖిల్ గిరి రాష్ట్రపతిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. బీజేపీ నేతలు నిత్యం తన రూపంపై విమర్శలు గుప్పిస్తుంటే తాను అలా అన్నానని, అయినా తాను చేసింది తప్పేనంటూ ఆయన క్షమాపణలు చెప్పారు.