Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మోడి పర్యటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మోడి పర్యటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మోడి పర్యటనను రేణుకా చౌదరి అత్యవసర పర్యటనగా అభివర్ణించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మోడి టూర్ ను ఆమె దక్షిణాది పర్యటనగా కూడా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణ భారత దేశంలో ముగిసిందని, ఈ యాత్రకు లభించిన అనూహ్య స్పందనను చూసి బీజేపీ భయపడిందని ఆమె పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు దక్కిన ఆదరణను చూసి భయపడ్డ మోడి దక్షిణ భారతంలో యాత్ర ముగియగానే దక్షిణ భారత పర్యటనకు ఆగమేఘాలపై వచ్చారని చౌదరి అన్నారు.