Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక: కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరు-ఊటీ రోడ్డులోని ఓ బస్టాండు మసీదులా ఉందని, అధికారులు ఆ బస్టాండును వెంటనే కూల్చివేయకపోతే తానే స్వయంగా కూల్చివేస్తానని హెచ్చరించారు. నేను దాన్ని సోషల్ మీడియాలో చూశాను. బస్టాండుపై ఒక పెద్ద డోమ్, రెండు చిన్న డోమ్‌లు ఉన్నాయి. పెద్ద డోమ్‌ను మధ్యలో, చిన్న డోమ్‌లను దానికి ఇరువైపుల ఏర్పాటు చేశారు. అది మసీదులా ఉందన్నారు. ఆ డోమ్‌లను కూల్చివేయాలని నేను ఇంజినీర్లకు మూడు, నాలుగు రోజులు గడువు ఇచ్చాను. ఆలోగా అధికారులు కూల్చకపోతే నేనే స్వయంగా జేసీబీ తీసుకెళ్లి కూల్చివేస్తాను అని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వ్యాఖ్యానించాడు. ప్రతాప్ సింహా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.