Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, నిర్మాణ సంస్థగా ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేసిన సినీ పరిశ్రమ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు.