Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాసాయిపేట మండల పరిధిలోని రామంతపూర్ శివారులో మంగళవారం ఉదయం 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక వైపు నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. బైక్ పై వెనక కూర్చున్న మాసాయిపేట గ్రామానికి చెందిన యువతకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.