Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ..తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి ( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి అని తెలిపాడు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి.వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది..సూపర్ స్టార్ కృష్ణగారి మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. టాలీవుడ్ జేమ్స్ బాండ్, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరని లోటు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‍బాబుకు ఇది తీరని వేదన ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృష్ణగారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.