Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. తెల్లవారుజామునే ఓ విషాదకర వార్తతో నిద్ర లేచానని, హీరో కృష్ణ నిజమైన లెజెండ్ నటుడు అని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మర్యాదపూర్వక నటుడు అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ మరణం పట్ల ఆయన కుమారుడు హీరో మహేశ్‌కు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఇద్దరు పేరెంట్స్‌ను కోల్పోవడం విషాదకరమే అని మహేశ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.