Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మిజోరాంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్టోన్ క్వారీ కుప్పకూలింది. రాతి క్వారీ కూలిపోవడంతో 12 మంది కూలీలు చిక్కుకుపోయారు. కూలీలతో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయం చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. స్టోన్ క్వారీ శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది కూలీలు బీహార్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. చిక్కుకున్న ఎనిమిది మంది వలస కూలీల మృతదేహాలను మంగళవారం అధికారులు వెలికితీశారు. చిక్కుకున్న మరో నలుగురు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు కొనసాగుతుందిు అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఒక ప్రకటనలో తెలిపింది. నయ్‌థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఉన్న ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన క్వారీలో ఈ ఘటన జరిగింది. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి.