Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంట్రాక్టు లెక్చరర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. టీఆర్ఎస్ కార్య వర్గ సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాసేపట్లో టీఆర్ఎస్ శాసనభాపక్ష , రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్దీకరణకు ఉత్తర్వులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ఎంబీబీఎస్ క్లాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభం కానుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమవేశం జరుగనుంది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఎంపీ లతో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొననున్నారు.