Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వివిధ దేశాలకు భారతీయ విద్యార్దులు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. అదే తరుణంలో 2021-22 విద్యా సంవత్సరంలో 1,99,182 భారతీయ విద్యార్థులు అమెరికా బాట పట్టారు. 2020-21లో ఈ సంఖ్య 1,67,582 మాత్రమే ఉండగా, తాజాగా 18.6 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఈ మేరకు అమెరికాలో విదేశీ విద్యార్థులకు సంబంధించి ఓపెన్ డోర్స్-2022 పేరుతో రూపొందించిన నివేదికను యూఎస్ ఎంబసీ అధికారులు సోమవారం విడుదల చేశారు. మొత్తంగా 2020-21తో పోలిస్తే అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల శాతం 3.8 శాతం పెరిగింది. 2020-21లో ఇతర దేశాలకు చెందిన 9.14 లక్షల మంది విద్యార్థులుంటే 2021-22కు 9.48 లక్షలకు చేరినట్లు ఈ నివేదిక వెల్లడించింది. విద్య కోసం అమెరికాకు వెళ్తున్న వారిలో చైనీయుల తర్వాతి స్థానంలో భారతీయులు ఉన్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో 31 శాతం చైనీయులు, 21 శాతం భారతీయులు ఉన్నారు. మొత్తంగా 52 శాతం భారత్, చైనాల నుంచే ఉండటం విశేషం.