Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వాట్సాప్ రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలలు తీసుకొస్తుంది. ఒకే నంబర్ పై రెండు మొబైల్స్ లో వాట్సాప్ సేవ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. బీటా టెస్టర్లు ఇప్పుడు ఈ సదుపాయాన్ని పరీక్షించే పనిలో ఉన్నారు. వాట్సాప్ లో ప్రస్తుతం లింక్డ్ డివైజెస్ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీని ద్వారా కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ఇలా మొబైల్ ఫోన్ కు అదనంగా, నాలుగు ఇతర డివైజెస్ లోనూ ఒకే వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఆదే తరుణంలో త్వరలోనే ఒకే నంబర్ పై రెండు మొబైల్స్ లో వాట్సాప్ లాగిన్ కు అవకాశం కల్పించనుంది. అలాగే, ప్రస్తుతం ఒక ఖాతాపై ఎన్ని డివైజెస్ లో వాట్సాప్ లాగిన్ అయి ఉన్నది తెలుసుకునే ఫీచర్ ను సైతం వాట్సాప్ తీసుకువస్తోంది. దీనివల్ల తమ ఖాతాను గుర్తు తెలియని వారు ఎవరైనా యాక్సెస్ చేస్తుంటే తెలుసుకుని చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. దీంతో పాటుగా మిస్డ్ కాల్స్ సేవను కూడా వాట్సాప్ తీసుకు వస్తోంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్ ను ఏనేబుల్ చేసుకున్న సమయాల్లో కాల్స్ మిస్ అయితే ఆ సమాచారాన్ని అందించనుంది.