Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ లో 11 అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులు వున్నాయి.
అర్హత: పోస్టును బట్టి 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రెండేళ్ల నుండి నాలుగేళ్ళ అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు నవంబర్ 29, 2022వ తేదీలోపు ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సాలరీ నెలకు రూ.40,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంతో పాటు అలవెన్సులు కూడా ఉంటుందన్నారు. పూర్తి వివరాలను https://epi.gov.in/content/innerpage/career.php లో చూడచ్చు.