Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పక్కన నిల్చుని నాలుగురు మాట్లాడుతున్న సమయంలో ప్రమాదం
- లారీ డ్రైవర్ వృద్ధుడు, అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
నవతెలంగాణ- వెల్గటూర్ : మండలంలోని కప్పారావుపేట్ బస్టాండ్ సమీపంలో కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారి పైకి ఓ వ్యక్తిపైకి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పొట్ట కింది భాగం నుండి లారీ టైర్ ఎక్కడంతో మృతుని శరీరం నుజ్జు నుజ్జు అయింది. మృతుడు శాఖపూర్ కు చెందిన నేరెళ్ల సత్తయ్య గౌడ్ (50) కాగా రంగు సత్తయ్య గౌడ్, కికలా లచ్చయ్య, అప్రమత్తమై పక్కకు జరగడంతో స్వాల్ప గాయాలతో బయట పడ్డారు. వారు తెలిపిన సమాచారం మేరకు కమ్మరి ఇంటి వద్దకు గొడ్డళ్లు కత్తులు సనా పెట్టుందుకు వెళ్లి రోడ్డు పక్కన నిల్చుని మాట్లాడుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెల్గటూర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.