Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైన్నైకి చెందిన 17 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది. ప్రియ అనే యువ ఫుట్‌బాలర్ కుడికాలి లిగమెంట్ చీలిక రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్ల సర్జరీ వికటించడంతో ఆమె కుడి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రియ నవంబర్ 8వ తేదీ నుంచి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఉంది. ప్రియ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ అంగీకరించారు. మంత్రి మట్లాడుతూ… ‘క్రీడాకారిణి మరణించడం బాధాకరం. డాక్టర్లు సర్జరీ బాగానే చేశారు. కానీ, కంప్రెషన్ బ్యాండేజీ గట్టిగా వేయడంతో రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో, క్రీడాకారిణి చనిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశాం. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది’ అని చెప్పారు.
ప్రియ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ చదువుతోంది. భారత ఫుట్‌బాల్ జట్టులో ఆడాలని కలలు కన్నదని ఆమె కోచ్ జోయెల్ చెప్పారు. ఆమె చనిపోవడానికి ముందు రోజు మంత్రి సుబ్రమణ్యం ఆమె కుటుంబాన్ని పరామర్మించారు. ఆధునిక కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఇంతలోనే ప్రియ చనిపోవడంతో కుటుంబసభ్యులు, తోటి క్రీడాకారులు ఆందోళన చేపట్టారు.