Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్‌ను నివారించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా జరిపిన తనిఖీల్లో మరో డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూడాన్ జాతీయుడితో పాటు మరో డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితుల నుంచి రూ. 2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఫలక్‌నూమా పోలీసు స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.