Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ తీస్తున్న టిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. అయితే బాణాసంచా ఉన్న ఆటో కి మంటలు అంటుకొని భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ప్రాణాపాయం తప్పి, స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.