Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యాపారితో కలిసి రూ.200 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ జాక్వెలిన్‌ను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముగియడంతో పాటు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినందున తనను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు మంగళవారం శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జాక్వెలిన్ తరఫున న్యాయవాదులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు విన్న తర్వాత జాక్వెలిన్‌కు రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఖరారు చేసింది. ఈడీ ఆగష్టు 13వ తేదీన కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో, జాక్వెలిన్‌ని కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ తన సప్లిమెంట్ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ మొదటిసారి తప్పుకు పాల్పడినట్టు పేర్కొంది. కోర్టు సెప్టెంబర్ 26వ తేదీన రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ సిద్ధంగా లేకపోడంతో ప్రత్యేక జడ్జి జస్టిస్.శైలేంద్ర మాలిక్ నవంబర్ 15వ తేదీవరకు జాక్వెలిన్ మధ్యంతర బెయిల్‌ని పొడిగించారు.