Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కోర్టు ధిక్కార పిటిషన్లపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. నెల్లూరు జిల్లా టీగూడూరు డివిజనల్ ఫారెస్ట్ అధికారి, ఫారెస్ట్ రేంజ్ అధికారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను ధిక్కరిస్తే వదిలేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో అటవీ భూమిలో రొయ్యల చెరువులు తవ్వారని, ఎందుకు ధ్వంసం చేయకూడదంటూ అధికారుల నోటీసులు ఇచ్చారు. రైతులు సవాల్ చేయడంతో నోటీసులను కోర్టు కొట్టేసింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసినా చెరువులను అధికారులు ధ్వంసం చేశారు. ఏపీ హైకోర్టులో రైతులు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 15న ఇద్దరు అధికారులకు శిక్ష విధిస్తామని హైకోర్టు పేర్కొంది. నష్టపరిహారం కోసం పిటిషన్ వేయాలని రైతులకు హైకోర్టు సూచించింది.