Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ రిటెన్షన్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదులుకుంది. ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు ముందే డిసెంబర్ 23న ఆటగాళ్ల మినీ వేలం జరగనుంది. అయితే అంతకంటే ముందే జట్టులో నిలబెట్టుకునే ఆటగాళ్లు, వదిలించుకునే ఆటగాళ్ల తుదిజాబితా వెల్లడికి చివరి తేదీ కావడంతో పలు ఫ్రాంచైజీలు పలువురు కీలక ఆటగాళ్లను వదులుకుంటున్నాయి. అందులో భాగంగానే కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఉద్వాసన పలికింది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ కూడా స్టార్‌ప్లేయర్ డ్వేన్ బ్రావోను వదులుకుంది.