Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ త్వరలోనే మొదలుకానుంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో ఇప్పటికే చాలా జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకున్నాయి. మరికొన్ని జట్లు ఒప్పందం ద్వారా కొందరిని ఇతర జట్లకు అమ్మేశాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వదులుకుంది. తమ ట్విట్టర్‌లో ఖాతాలో వదులుకున్న ఆటగాళ్ల ఫొటోల్నిపెట్టింది. ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు ఇంతమందిని తొలగించడం ఇదే మొదటిసారి. వేలంలో ఈ ఫ్రాంఛైజీ 13మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. వీళ్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ.20.55 కోట్ల ఖర్చు చేయనుంది.
ముంబై జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో.. కీరన్ పోలార్డ్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, సంజయ్ యాదవ్, రిలే మెరిడిత్, టైమల్ మిల్స్, డానియెల్ సామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.