Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ గద్దను కాపాడేందుకు అగ్నిమాపక విభాగానికి చెందిన జవాన్‌లు దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లోగల ఓ చెట్టుపై గద్ద వేలాడుతూ ఉండటాన్ని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన ఓ జవాన్ చూశాడు. దాని కాళ్లకు పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంఝా చుట్టుకున్నట్లు గుర్తించాడు. వెంటనే అతను ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం ఇవ్వగా వారు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గద్దను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఆ గద్దను రక్షించారు.