Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గ్రూప్ – 1 ప్రిలిమినరీ ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్ ప్రాథమిక కీ అభ్యంతరాలపై చర్చించింది. అనంతరం మంగళవారం కీని విడుదల చేశారు. ఫైనల్ కీ కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ -1 రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అదే నెల 29వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు.