Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి.
15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. కాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు.