Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో వద్ద ఆగివున్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతులు..ప్రసాద్ (నారాయణపురం), మహేష్ (ఉండ్రాజవరం,), మంగ (నల్లజర్ల), హారతి (వరంగల్ ), మణికంఠ గుణంపల్లిగా పోలీసులు గుర్తించారు. మృతులు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.