Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి స్థాయి కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోటీలను జీఎం పర్సనల్ కె. బసవయ్య, జీఎం ఎ. కుమార్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు గేమ్స్ జరుగనున్నాయని తెలిపారు.
కబడ్డీ విభాగంలో బెల్లంపల్లి- మందమర్రి, కొత్తగూడెం కార్పొరేట్జట్ల మధ్య జరిగిన పోటీలో బెల్లంపల్లి - మందమర్రి జట్టు విజయం సాధించింది. ఆర్జీ 1- 2 జట్టుతో ఆర్జీ 3 - భూపాలపల్లి జట్టు తలపడగా ఆర్జీ 1- 2 జట్టు గెలిచింది. బాల్బ్యాడ్మింటన్ విభాగంలో శ్రీరాంపూర్ జట్టుతో ఇల్లెందు - మణుగూరు తలపడగా శ్రీరాంపూర్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆర్జీ 1-2, బెల్లంపల్లి - మందమర్రి జట్ల మధ్య పోరులో బెల్లంపల్లి – మందమర్రి జట్టు గెలిచింది.