Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ఆయన కాగజ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. వీరికి ఎస్పీఎం క్రీడా మైదానంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘనస్వాగతం పలికారు.