Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడప: పులివెందులలో కృష్ణమోహన్ అనే వీఆర్ఓపై పెద్ద మస్తాన్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహసీల్దార్ కార్యాలయంలోనే దస్తగిరి అనే వ్యక్తి విఆర్‌ఓపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పులివెందుల నగిరిగుట్టలోని ఓ స్థల వివాదాన్ని పరిష్కరించలేదనే కారణంగా దస్తగిరి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గాయపడిన వీఆర్‌ఓను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.