Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోకి భక్తులను అక్రమంగా పంపుతున్న కానిస్టేబుల్ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. క్యూలైన్ లోకి భక్తులను అక్రమంగా పంపడం గత కొంత కాలంగా జరుగుతోంది. ఇది ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఈయన కొంత మందితో కలిసి ఈ దందాను ప్రారంభించాడు. భక్తుల నుంచి నగదు తీసుకుని టికెట్లు లేకుండానే క్యూ లైన్లలోకి పంపుతున్న తరుణంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.