Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 1, 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తమ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని, నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. సూరత్ (తూర్పు) నియోజవర్గ మా అభ్యర్థి కంచన్ జరివాలా, ఆయన కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. మొదట, ఆయన నామినేషన్ తిరస్కరించడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ నామినేషన్ ను ఆమోదం లభించింది. తరువాత, తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కంచన్ పై ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేశారా? అని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించడం లేదు, ఆయన్ని కిడ్నాప్ చేశారని తెలిపారు.