Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. పద్మాలయా స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహం బయల్దేరింది. ఈ సందర్భంగా ఆయనను కడసారి చూసుకునేందుకు వచ్చిన అభిమానులందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. పూలతో అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహం ముందు కదులుతుండగా వెనుక ఆయన కుమారుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితుల వాహనాలు అనుసరిస్తున్నాయి. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. మరోవైపు, అంతిమయాత్ర కొనసాగుతున్న మార్గం మొత్తం జనసంద్రమైంది. రోడ్డుకిరువైపులా జనాలు నిలబడి కృష్ణకు వీడ్కోలు పలుకుతున్నారు. భారీ భద్రత మధ్య యాత్ర కొనసాగుతోన్న తరుణంలో కృష్ణ అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల లాఠీచార్జ్ కి కూడా దిగారు. పద్మాలయ స్టూడియో దగ్గర అభిమానుల తోపులాట కూడా చోటు చేసుకుంది. బారికేడ్లు తోసుకుని ఒక్క సారిగా లోనికి అభిమానులు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు పద్మాలయ స్టూడియో దగ్గర లాఠీ చార్జ్ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది.