Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత ప్రభుత్వ డిఫెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో మొత్తం 80 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులని కోరుతున్నారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిలి ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా వున్నాయి.
అర్హులు: ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి ఉండాలి.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నవంబర్ 21, 2022వ తేదీ వరకు అవకాశం వుంది. అప్పటి లోగా పంపచ్చు. ఇక ఎలా ఎంపిక చేస్తారనేది నోటిఫికేషన్ లో వుంది. స్టైపెండ్ వివరాలు కూడా అందులో వున్నాయి చూడండి. పూర్తి వివరాలను https://www.bemlindia.in/ లో చూడచ్చు.