Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ బ్యాండ్ మధ్య అంతమ యాత్ర పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగి పార్థివదేహం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికకు చేరుకుంది. అయితే పోలీసులు మహాప్రస్థానంలోకి అందరినీ అనుమతించలేదు. సన్నిహితులను మాత్రమే లోపలకు పంపి, ఇతరులందరినీ బయటే ఆపేశారు. మహాప్రస్థానం కు చేరుకున్న తర్వాత కృష్ణ పాడెను ఆయన చిన్ననాటి మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్, టీడీపీ నేత బుద్దా వెంకన్న మోశారు. మరి కాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.