It is India's time now!
— Piyush Goyal (@PiyushGoyal) November 16, 2022
The new President of the G20 🇮🇳 pic.twitter.com/ZQrDU72xWh
Authorization
It is India's time now!
— Piyush Goyal (@PiyushGoyal) November 16, 2022
The new President of the G20 🇮🇳 pic.twitter.com/ZQrDU72xWh
డిల్లి: వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న తరుణంలో రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చేపట్టారు. ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను నరేంద్ర మోదీ స్వీకరించారు. ఏడాది పాటు డిసెంబర్ 1 నుంచి నవంబర్ 20 దాకా భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలను కొనసాగనుంది. బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా మోడి తెలిపారు.