Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొన్ని రోజుల నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణలో బీజేపీ తమ పార్టీ బలోపితం కోసం కృషి చేస్తూ ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై గురి పెట్టింది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ సాయంత్రం ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. తాజాగా బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు డీకే అరుణ కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో శశిధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆయన పార్టీ మారబోతున్నారనే దిశగా సంకేతాలను ఇస్తున్నట్టుగా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్ రేవంత్ కు ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని కూడా విమర్శించారు.