Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నాయకులు పార్టీలు మారుతున్న ప్రచారం పెరుగుతుంది. ఈ తరుణంలో హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపికి గుడ్ బై చెప్పబోతున్నారా? తిరిగి మల్లి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది. తాజాగా ఈ అంశంపై ఈటెల రాజేందర్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, టిఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఆయన కూడా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని మీడియాతో చెప్పారు. తన మనవడి స్కూల్ ప్రోగ్రాం కోసమే తాను ఢిల్లీకి వచ్చానని తాను వచ్చిన విమానంలో బిజెపి నేతలు ఉండడంతో అందరూ అలా అనుకున్నారని స్పష్టం చేశారు.