Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంత్రి మెరుగు నాగార్జున నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో దళితులలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు అన్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద చంద్రబాబు ముక్కు నేలకేసి రాయాలని డిమాండ్ చేశారు. లేదంటే నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర అని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సుయాత్ర ఎవరి కోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని చేసినా 2024 ఎన్నికలలో తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.