Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటన గురించి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అప్పటి వరకు కెమెరా ముందుకు రానని, గత 35 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నానని, కానీ ఏదో కోల్పోయానన్న వేదన మనసులో ఉందని తెలిపారు. ఇక సినిమాలకు విరామం ఇచ్చి మా అమ్మ, పిల్లలతో గడపాలని భావిస్తున్నానని అన్నారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడంపైనే తాను ప్రస్తుతం దృష్టి సారిస్తున్నానని, తన కొత్త ప్రాజెక్టు చాంపియన్స్ చిత్రంపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి తాను నిర్మాతను కూడా అని ఆమిర్ వెల్లడించారు. తాను ఈ చిత్రంలో నటించికపోయినా నిర్మాతగా కొనసాగుతానని, మరొక నటుడితో చిత్రాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. ఇన్నాళ్లపాటు సినిమాల గురించే ఆలోచించి, ఎంతో నష్టపోయాననిపిస్తోందని, ఇది సరైన పంథా కాదనిపిస్తోందని వ్యక్తం చేశారు.