Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు వీఆర్ఏలకు తీవ్ర గాయాలు
నవ తెలంగాణ-నవీపేట్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ సమీపంలో నిజామాబాద్ నుండి వస్తున్న లారీ(MH04GG2833)ఢీకొని ఇద్దరు విద్యార్థులతో పాటు ఇద్దరు వీఆర్ఏలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో నివాసముంటున్న ఉదయ్(14), సాయి తేజ(14) లు 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కలిసి మోటార్ బైక్ పై నిజామాబాద్ నుండి తిరిగి వస్తుండగా రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్ప అడ్డు రావడంతో పక్కనుండి వెళ్లే ప్రయత్నం చేయగా వెనుక వైపు నుండి వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతలోనే ముందు నుండి వస్తున్న మహంతంకు చెందిన ఇద్దరు వీఆర్ఏలు గోపాల్, సాయిలు లను సైతం కంగారులో ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాదం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన లారీని యంచ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ యంచ చెక్పోస్ట్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్కు పంపించారు.