Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అవయవదానంపై ప్రకటన చేశారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. తన మరణానంతరం అయవాలను దానం చేస్తానని వెల్లడించారు. తాను జీవించినంత కాలం అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటానని తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో అవయవదానం చేయడం చాలా తక్కువ అని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. అవయవాలు ఎంతో విలువైనవి అని, వాటిని మట్టిపాలు చేయడం కంటే, మరొకరికి దానం చేయడం ద్వారా వారికి ఆయుష్షు పోసినవాళ్లం అవుతామని వివరించారు.